Logo
Date of Publish : 22 July 2026, 8:32 am
Editor : B. Anil Kumar

ఫలించిన యాగం ఫలితం..పంటలకు జీవం పోసిన వర్షం

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రజలు

విజేత,తాండూరు : వర్షంతో అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులుగా వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరణ దేవుడికి కరుణించాలని కోరుకుంటూ.. సోమవారం తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ఆవరణలో ది గ్రేట్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన (వరుణ యాగం...) భక్తిశ్రద్ధలతో శివలింగానికి వేదమంత్రాలతో జలాభిషేకం రుద్రాభిషేకం పంచ సూక్తి హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరుణించిన వరుణుడు

మంగళవారం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా కురిసిన వర్షానికి రైతు అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. తాండూరు నియోజకవర్గం లో పలు గ్రామాల్లో రైతులు వరుణుడి కరుణ కోసం గ్రామదేవతలకు పూజలు చేశారు. బొడ్రాయి, మైసమ్మ, ముత్యాలమ్మ దేవతలకు నీళ్లు పోశారు. వర్షాలు కురవాలని మొక్కులు సైతం మొక్కుకున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )