నార్సింగి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీశ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు
విజేత,రాజేంద్రనగర్ : పౌర్ణమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సాయిబాబా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ ఉప్పొంగింది. బాబా ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నార్సింగి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీశ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు సమర్పించారు.ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో కాంగ్రెస్ నాయకులు, పలువురు కళాకారులు మరియు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం పాల్లోని బాబా ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం "సాయి నామస్మరణ"తో మార్మోగింది.ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దివ్యమైన హారతి కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య నాయకులు, భక్తులు లక్ష్మీ శ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.