Logo
Date of Publish : 12 October 2026, 2:21 pm
Editor : B. Anil Kumar

పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో రైతు

మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ కొరకు భూసేకరణ

విద్యుత్ సరఫరా అందక వరి, కంది పంట ఎండు ముఖం

భూమి పైసలు రావేమోనని దిగులు చెందిన రైతు దోరమోని పూజ వెంకటయ్య

చేతిలో నుండి భూమిపాయే, పైసలు రాకపోయే సరికి మనస్థాపం చెంది పురుగుల మందు తాగిన రైతు

విజేత,వికారాబాద్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ కొరకు భూసేకరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా దుద్యాల మండల పరిధిలోగల హకీంపేట గ్రామంలో కూడా రైతుల నుండి భూసేకరణ పనులు ముమ్మరంగా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు తమ భూములు ఇస్తున్నందున నష్టపరిహారంగా ఒక్క ఎకరానికి 20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు హకీంపేట్ గ్రామ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించింది. కానీ, దోరమోని పెద్దరామయ్య కుమారుడు దోరమోని పూజ వెంకటయ్యకు రావల్సిన భూ నష్టపరిహారం అందలేదు. ఏ కారణం చేతనో గానీ, ఎవరి ప్రోద్బలంతో గానీ దోరమోని పూజ వెంకటయ్యకు భూమి నష్టపరిహారం అందకుండా చేస్తున్నారని అతనితో పాటు కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నామని మీడియాతో మొరపెట్టుకున్నారు. పురుగుల మందు తాగిన పూజ వెంకటయ్యకు భార్య దోరమోని లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, ఒక్క కుమారుడు ఉన్నారు. హకీంపేట్ గ్రామంలో దోరమోని పూజ వెంకటయ్యకు సర్వే నంబర్లు 142/ఉ లో 1.24 ఎకరాలు, 142/రు/2లో 0.04 ఎకరాలు, 142/రు/1 లో 1.19 ఎకరాలు, 144/ఆ లో 1.26 ఎకరాలు, 144/ ఇ లో 1.26 ఎకరాలు మొత్తం 6 ఎకరాల 19 గుంటల భూమి ఉన్నదని అతని భార్య దోరమోని లక్ష్మి మీడియాకు తెలిపింది. చేతిలో నుండి భూమిపాయే, నష్టపరిహారం అందకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలోనని మనస్థాపం చెందిన దోరమోని పూజ వెంకటయ్య పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స అందిస్తున్న వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి భరోసా ఇవ్వలేకపోతున్నారు. హకీంపేట్ గ్రామ సర్పంచ్ రవీంద్ర నర్సింహారెడ్డి వివరణ ప్రకారం ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్న కారణంగా ప్రభుత్వము నుండి నష్టపరిహారం అందడం లేదని తెలిపారు. అన్నదమ్ముల మధ్య గొడవలు సద్దుమణిగాక వారికి రావలసిన నష్టపరిహారం తప్పకుండా అందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. దోరమోని పూజ వెంకటయ్య కోర్టు నుండి స్టే తెచ్చుకోవడంతో నష్టపరిహారం ప్రభుత్వ అధికారులు ఇవ్వలేకపోతున్నారని సర్పంచ్ తెలిపారు. కోర్టులో వేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటేనే నష్టపరిహారం అందుతుందని గ్రామ సర్పంచ్ రవీంద్ర నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. నా వంతు ప్రయత్నం గా వారికి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ ప్రతినిధులు మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )