Logo
Date of Publish : 02 September 2026, 7:08 pm
Editor : B. Anil Kumar

పదో తరగతి అనంతర విద్యా అవకాశాలపై అవగాహన సదస్సు

గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెద్దకోడూరు కళాశాల (బాలికలు) ఫైనల్ ఇయర్ విద్యార్థినిలు

విజేత,సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా ఎన్సాన్‌పల్లి గ్రామంలోని పి.ఎం శ్రీ టీజీ రెసిడెన్సి యల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాల బాలికలు మరియు ZPHS తడకపల్లి లో 9వ మరియు 10వ తరగతి విద్యార్థినుల కోసం "పదో తరగతి తర్వాత విద్యా అవకాశాలు" అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థినులు శ్రీనిత్య, సంధ్య శ్రీనివాస్, సాత్విక, అమూల్య కొమురవెల్లి, హారిణి, వైష్ణవి, అక్షిత, లోహిత, శ్రుతి పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించారు.పదో తరగతి అనంతరం ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా కోర్సుల ప్రాధాన్యత, వాటి ప్రయోజనాలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు మరియు ఉన్నత విద్యకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

అలాగే కంప్యూటర్ సైన్స్ (CSE) రంగంలో ఉన్న అవకాశాలు, ప్రోగ్రామింగ్ భాషలు, వెబ్‌సైట్ అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా సరైన విద్యా మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.వేదికపై ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మరియు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమం విద్యార్థినులలో మంచి స్పందనను పొందగా, భవిష్యత్ విద్యా ప్రణాళికలపై స్పష్టతను కల్పించిందని ఉపాధ్యాయులు అభినందించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )