Logo
Date of Publish : 05 September 2026, 8:47 am
Editor : B. Anil Kumar

పథకాలను తుంగలో తొక్కిన ఇప్పటి కాంగ్రెస్ మార్క్ పాలన ఎక్కడ? 

గాల్లో కలిసిపోయాయి అంటూ మణికొండ, నెక్నాంపూర్ మున్సిపల్ డివిజన్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

కాంగ్రెస్ నిలబెట్టుకోలేని '1000 రోజుల పాలన'పై తిరుగుబాటు

విజేత,రాజేంద్రనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి మోసపోయామని, నాటి కేసీఆర్ సర్కార్ అందించిన ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలు నేడు గాల్లో కలిసిపోయాయని మణికొండ, నెక్నాంపూర్ మున్సిపల్ డివిజన్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పాషా కాలనీ, గోల్కొండ కోహీనూరు కాలనీ, బాపు హిల్స్, శివాజీ నగర్, మణికొండ క్వార్టర్స్‌లలో నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టబడ్డాయి.తల నరికినా, పింఛన్ ఆపని కేసీఆర్ పాలన ఎక్కడ? పథకాలను తుంగలో తొక్కిన ఇప్పటి కాంగ్రెస్ మార్క్ పాలన ఎక్కడ? అని స్థానికులు ప్రతిచోటా నిలదీశారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో వృద్ధులు, వితంతువులకు రూ. 2016, దివ్యాంగులకు రూ. 3016 చొప్పున ఇచ్చిన ఆసరా పింఛన్లు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చిన 'కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్' (రూ. 1,00,116/-), దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన 'దళిత బంధు' (రూ. 10 లక్షల ఉచిత గ్రాంట్), బీసీ వర్గాలకు అందించిన ' బంధు' (రూ. 1 లక్ష) లాంటి చారిత్రాత్మక పథకాలు నేడు లబ్ధిదారులకు అందకుండా పోయాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేసుకున్న తల్లి, బిడ్డలకు అందించిన 'కేసీఆర్ కిట్', పోషకాహార లోపాన్ని నివారించే 'కేసీఆర్ న్యూట్రిషన్ కిట్', 'ఆరోగ్య లక్ష్మి', దేశంలోనే రికార్డు సృష్టించిన 'కంటి వెలుగు' ఉచిత పరీక్షలు నేడు ప్రజాదరణ కోల్పోయి, పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని నాయకులు మండిపడ్డారు.ఈ పర్యటనలో బిఆర్ఎస్ బృందాన్ని కలిసిన మున్సిపల్ శానిటేషన్ కార్మికులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. కష్టపడి పనిచేస్తున్న తమకు నెలల తరబడి జీతాలు అందడంలేదని, ఒక్కొక్కరికి ఒకటి నుండి మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో పడిపోవడంతో తీవ్ర ఆర్థికబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.1000 రోజుల కాంగ్రెస్ పాలన ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ప్రజలు, కార్మికులు పడుతున్న ఇబ్బందులపై BRS పోరాటం విశ్రమించదని మణికొండ, నెక్నాంపూర్ డివిజన్ BRS నేతలు హెచ్చరించారు. ఈ నిరసన కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజాగ్రహానికి నిదర్శనమని వారు స్పష్టం చేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )