Logo
Date of Publish : 06 November 2026, 8:25 am
Editor : B. Anil Kumar

పంట చేతికొచ్చే వేళ.. మోటార్ల చోరీ

నవోదయ కెనాల్ పరిధిలో 5 హెచ్‌పీ మోటార్లు అపహరణ

నీరు అందక పంట నష్టపోతామని రైతుల ఆవేదన

విజేత,చొప్పదండి: పంట చేతికొచ్చే సమయంలో గుర్తుతెలియని దొంగలు రైతుల పాలిట శాపంగా మారారు. చొప్పదండి మర్లవాడకు చెందిన రైతులు ఎగుర్ల రాజమల్లు, అమరగొండ తిరుపతికి సంబంధించిన వ్యవసాయ బోరు మోటార్లను గురువారం రాత్రి దొంగలు అపహరించారు.ఒక్కొక్కటి 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లను ఫ్యూజులు తొలగించి మరీ ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నవోదయ కెనాల్ ప్రాంతంలోని తమ పంటలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని, మరో వారం రోజుల పాటు నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కీలక దశలో ఉన్న సమయంలో మోటార్లు చోరీ కావడంతో నీరు అందక పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్ద దొంగతనాలు జరుగుతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.గత రెండు రోజులు గా 4 గురి మోటార్ల చోరీ జరిగాయి,పోలీసులు వ్యవసాయ ప్రాంతాల్లో రాత్రి గస్తీని ముమ్మరం చేసి, మోటార్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 840