Logo
Date of Publish : 07 September 2026, 1:17 pm
Editor : B. Anil Kumar

దేవుని గుట్ట తండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ.

పాల్గొన్న సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్.

విజేత ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి యూనిఫాం లను సోమవారం సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం లను అందిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్యా బోధన అందుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి,విద్యాభివృద్ధికి, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించుటకు ఎల్లప్పుడూ గ్రామపంచాయతీ పాలకవర్గం అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత కళ్యాణ్ నాయక్, వార్డు సభ్యులు రాంసింగ్ నాయక్, బుజ్జిబాయి, ఉపాధ్యాయులు రోజా, అంజలి, అంగన్వాడీ టీచర్ జ్యోతి, గ్రామ కార్యదర్శి పవిత్ర, గ్రామ నాయకులు సురేష్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )