Logo
Date of Publish : 05 November 2026, 10:38 am
Editor : B. Anil Kumar

దూడల ఆరోగ్యమే మా ప్రాధాన్యం

- శ్రీ కృష్ణ గోశాలలో ఘనంగా ఉచిత డీవార్మింగ్ క్యాంప్

- దూడల సంరక్షణకు ప్రత్యేక వైద్య సేవలు: పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ అకం రాజు

విజేత,రాజేంద్రనగర్ : గోమాతల సంరక్షణ, దూడల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని ‘శ్రీ కృష్ణ గోశాల’లో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత డీవార్మింగ్ (నట్టల నివారణ) వైద్య శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అకం రాజు మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య సంరక్షణలో నట్టల నివారణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్రమం తప్పకుండా డీవార్మింగ్ మందులు అందించడం ద్వారా దూడల్లో రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఎదుగుతాయని స్పష్టం చేశారు.గోశాలలోని మూగజీవాల ఆరోగ్య రక్షణకు తమ శాఖ తరఫున ఎల్లప్పుడూ అవసరమైన వైద్య సేవలు, ఔషధాలు అందిస్తామని జేడీ హామీ ఇచ్చారు. గోశాల నిర్వాహకులు కూడా నిరంతరం దూడల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉంచుతూ, పశువైద్యుల సూచనలను క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటిటిడి (TTD) గోశాల సభ్యులు కోటి శ్రీధర్, రాజేంద్రనగర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ అహ్మద్, VLO శోభారాణి, వెటర్నరీ అసిస్టెంట్లు శివ, యాదగిరిలతో పాటు గోశాల నిర్వాహకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 601