Logo
Date of Publish : 01 September 2026, 3:13 pm
Editor : B. Anil Kumar

తొర్రూరు మండల ఏంఆర్ పిఎస్–ఏంఎస్ పి నూతన మండల కమిటీ ఎన్నిక

విజేత,తొర్రూరు : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, జిల్లా ఇన్‌చార్జ్ జన్ను దినేష్ మాదిగ మరియు ఏకు శంకర్ మాదిగ ఆధ్వర్యంలో, మండల ఇన్‌చార్జులు ఇస్సాంపల్లి సాయి, సోమరపు లింగన్న మాదిగ సమక్షంలో తొర్రూరు మండలంలో ఏంఆర్ పిఎస్ మరియు ఏంఎస్ పి నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఏంఆర్ పిఎస్ తొర్రూరు మండల అధ్యక్షునిగా పోలేపల్లి గ్రామానికి చెందిన పందుల విజయ్ ని అధికార ప్రతినిధిగా గూడెల్లి మధు మాదిగ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఏం ఎస్ పి తొర్రూరు మండల అధ్యక్షునిగా నకరికంటి ఆంజనేయులు, అధికార ప్రతినిధిగా సంకినేని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మండలంలోని సీనియర్ నాయకులు బచ్చలి వెంకన్న, మంద యాకమల్లు పాల్గొన్నారు.తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ఏంఆర్ పిఎస్ మరియు ఏంఎస్ పి నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాదిగల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )