Logo
Date of Publish : 23 October 2026, 4:43 pm
Editor : B. Anil Kumar

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతకమ్మ 

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

విజేత,రాయికల్: రాయికల్ మండలంలోని గ్రామాలలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగతో మండల గ్రామాలు పూల సంద్రంగా మారింది.తొమ్మిది రోజుల పాటు తమ ఇళ్లలో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చి, పూజలు చేసిన ఆడపడుచులు, చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉదయం నుండే కొత్త పట్టుచీరలు కట్టుకుని, చేతిలో రంగురంగుల బతుకమ్మలతో గ్రామ వీధుల్లో సందడి చేశారు. గునుగు, తంగేడు, బంతి, చేమంతి, కట్ల పూలతో ఎత్తుగా, అందంగా పేర్చిన బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అనంతరం మహిళలందరూ చెరువుల వద్దకు భారీగా చేరుకున్నారు. అక్కడ వలయంగా ఏర్పడి "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో" అంటూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడారు. ఆ పాటల్లో అత్తగారింటి ముచ్చట్లు, పుట్టింటి మమకారాలు, పంటలు బాగా పండాలనే ఆకాంక్షలు వినిపించాయి. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనడంతో వాగు పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి.చివరగా సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, తెచ్చుకున్న సద్దులను, ఒకరికొకరు ప్రేమతో పంచుకున్నారు. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలకు సారె పెట్టి గౌరవంగా సాగనంపారు.ఈ వేడుకల్లో గ్రామాల ప్రజా ప్రతినిధులు మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు. గ్రామాలలో జరిగిన ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 41