Logo
Date of Publish : 20 June 2026, 10:15 am
Editor : B. Anil Kumar

తారు రోడ్డు పనులతో వారం రోజులుగా వ్యాపారుల అవస్థలు

తారు రోడ్డు పనులతో వారం రోజులుగా వ్యాపారుల అవస్థలు

ప్రధాన రహదారి మూసివేత పడకేసిన చిరు వ్యాపారాలు

పనులు నత్తనడకనఆర్థిక ఇబ్బందుల్లో వ్యాపారులు

 

విజేత,చొప్పదండి: చొప్పదండి పట్టణంలో తారు రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం ప్రధాన రహదారిని మూసివేయడంతో గత వారం రోజులుగా రహదారి వెంట ఉన్న చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటోంది.రోడ్డు మూసివేత కారణంగా వినియోగదారుల రాకపోకలు తగ్గిపోవడంతో పండ్ల వ్యాపారులు,హోటల్ నిర్వాహకులు,కిరాణా దుకాణదారులు,టీ స్టాల్ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. "రోడ్డు మూసివేసి పనులు వేగంగా పూర్తి చేస్తారని భావించాం.కానీ పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.రోడ్డు మూసివేత వల్ల కస్టమర్లు రావడం లేదు. రోజువారీ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి" అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులతో తమ ప్రాంతానికి వెలుగులు వస్తాయని ఆశించిన వ్యాపారులకు ప్రస్తుతం చీకటిరోజులుఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. రోజువారీ ఫైనాన్స్ చెల్లింపులు, దుకాణాల అద్దెలు,ఉద్యోగుల జీతాలు వంటి ఖర్చులు భారం అవుతున్నాయనిచెబుతున్నారు. వ్యాపారం లేకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని పేర్కొంటున్నారు.పనులు వేగవంతం చేయాలి గుత్తేదారు బాధ్యతాయుతంగా వ్యవహరించి పనులను వేగవంతం చేస్తే ఈ పరిస్థితి ఉండేదే కాదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. రహదారిని పూర్తిగా మూసివేసి పనులు నత్తనడకన సాగించడం వల్ల ప్రజలతో పాటు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి పనుల పురోగతిపై దృష్టి సారించి, సాధ్యమైనంత త్వరగా రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఆర్థిక నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )