విజేత, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లోని బస్ స్టాప్ వద్ద యాచారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుందర్ రావు తండ్రి లింగయ్య 47 సంవత్సరాలు, ప్రయివేట్ డ్రైవరు, ఖానాపురం గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా అను వ్యక్తి మద్యం సేవించి వాహనం నడపడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు. సోమవారం స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుజాత మోటార్ వెహికిల్ చట్టం 185(ఏ) సెక్షన్ ప్రకారం అట్టి వ్యక్తికి 1 రోజు ట్రాఫిక్ డ్యూటి 6,000/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా నందేశ్వర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, యాచారం పోలీస్ స్టేషన్ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు రోడ్డుపై వెళ్లే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.