Logo
Date of Publish : 05 September 2026, 11:48 am
Editor : B. Anil Kumar

డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లు

* నిద్ర మత్తులో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్

* ఇందిరమ్మ ఇళ్లకు ఫొటో తీసేందుకు డబ్బులు వసూలు.

* గ్రామంలో ఇష్టానురాజ్యంగా పెత్తనం చెలాయిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి.

* ప్రైవేట్ ఉద్యోగి వల్ల ప్రభుత్వ నిధులు,ప్రభుత్వ పథకాలు దారిమల్లే అవకాశం..!

* గత నాలుగు ఏండ్లుగా ప్రైవేట్ ఉద్యోగి గా కొనసాగింపు.

* ఇదివరకు ఉపాధిహామీ పధకంలో కూడా డబ్బులు వసూలు చేసిన సదరు ఉద్యోగి.

* నాకేం తెలియదని చెప్పిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

విజేత, దేవరకొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మరియు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉండగా కొందరు మధ్యవర్తులు కుమ్మక్కై లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు పాల్పడుతున్నారు.దేవరకొండ మండలం అచ్చమ్మకుంట తండాలో పంచాయతీ కార్యదర్శి గ్రామంలో తన స్వతహాగా ఒక ప్రైవేట్ ఉద్యోగిని పెట్టుకొని గ్రామ పంచాయతీలో ప్రభుత్య పనులను కొనసాగిస్తున్నారు.ఇదే తనువుగా తీసుకున్న సదరు ఉద్యోగి,గ్రామ కార్యదర్శికి తెలియకుండా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను సరియైన లబ్ధిదారులకు అందజేయకుండా అంతా నా ఇష్టం,తనే కార్యదర్శి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇందిరమ్మ ఇళ్లలో ఫైలు ముందుకు జరగాలన్న, ఫోటోలు అప్లోడ్ చేయాలన్న కాసులు ఇవ్వాల్సిందే.లేకుంటే,పని చెయ్యను అని కరాకండిగా చెప్పేస్తాడు.ఇట్టి విషయం లబ్ధిదారులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నానా తంటాలు పడుతున్నారు. ఇదే కాకుండా ఉపాధి హామీ పథకం పనుల్లో కూడా ఒక నెలకు ఎటువంటి పనులు చెయ్యకుండా, హాజరుకు వేసినందుకు గాను ఒక్కొక్కరి చొప్పున వంద రూపాయలు వసూలు చేసేవాడిని కూడా ఆరోపణలు ఉన్నాయి.గత మూడేళ్లుగా తన ఆగడాలకు అంతు లేకుండా పోయిందని తండా వసూలు అంటున్నారు.ఒక ప్రైవేట్ ఉద్యోగి వల్ల ప్రభుత్వ నుండి వచ్చే,పోయే నిధులు దుర్వినియోగం జరిగే అవకాశం లేకపోలేదు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తదుపరి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా....

పంచాయతీ కార్యదర్శి డేవిడ్ రాజు కి వివరణ కోరగా తను దివ్యంగులై,ఆరోగ్యం స్థితి ఉండడం వలన గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రైవేట్ ఉద్యోగిగా పెట్టుకొని ప్రభుత్వ పనులు చెపిస్తున్నానని అన్నారు.కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంభందించి డబ్బులు తీసుకుంటున్న విషయం నాకు తెలీదు అని అన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )