Logo
Date of Publish : 23 July 2026, 10:45 am
Editor : B. Anil Kumar

చిత్రలేఖన పోటీలతో జాతీయ పతాక దినోత్సవ వేడుకలు

విజేత,రాయికల్: జాతీయ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వాసం ప్రసాద్ మాట్లాడుతూ, జాతీయ జెండా ఒక దేశ స్వేచ్ఛకు, సార్వభౌమాధికారానికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. మన త్రివర్ణ పతాకం కేవలం మూడు రంగుల కలయిక మాత్రమే కాదని, దేశ సంస్కృతి, త్యాగాలు, పోరాట స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు జాతీయ పతాక విశిష్టతను తెలుసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి సుధవేణి మురళిగౌడ్, క్లబ్ సభ్యులు బత్తిని భూమయ్య, మ్యాకల రమేష్, కాటిపల్లి రాంరెడ్డి, ఆదిరెడ్డి, దాసరి గంగాధర్, గంప ఆనందం, సంకోజి అశోక్, బొమ్మకంటి నవీన్, కురుమ సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు దొంతి సతీష్, రాజేశం, విద్యార్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )