Logo
Date of Publish : 17 September 2026, 6:20 pm
Editor : B. Anil Kumar

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం

మండల కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ

దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం

రాయికల్ తహసిల్దార్ ఎస్.నాగార్జున 

విజేత,రాయికల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాయికల్ మండల తహసిల్దార్ కార్యాలయం&ప్రజాపరిషత్ కార్యాలయాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ తహసిల్దార్ ఎస్.నాగార్జున జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ యస్. నాగార్జున మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నాటి చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైందని, అందుకే ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని అన్నారు. రజాకార్ల అరాచకాలను ఎదురించి, తెలంగాణ రైతాంగం, ప్రజలు చేసిన సాయుధ పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణాల నడిపించిన వీరుల త్యాగాలను స్మరించుకుందామన్నారు దేశ సమగ్రతకు సర్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక కర్తవ్యం మని ఉద్ఘాటించారు. ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బింగిచిరంజీవి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజా పాలనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్.ఐ.పద్మయ్య, అధికారులు, ఎంపీవో సుష్మా, ఏపీవో దివ్య, సూపరింటెండెంట్, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )