Logo
Date of Publish : 10 November 2026, 3:41 pm
Editor : B. Anil Kumar

గ్రామకంఠం భూములపై ఉన్నతాధికారుల విచారణ

- వివాదాస్పద భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ కిరణ్మయి.

విజేత, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామంలో గతకొద్దిరోజులుగా వివాదస్పదంగా ఉన్న గ్రామ కంఠం భూములను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీపీఓ సురేష్ మోహన్, ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డిలు మంగళవారం గ్రామానికి వచ్చి పరిశీలించారు. గ్రామంలోని 4.20 ఎకరాల వివాదాస్పద గ్రామకంఠం భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. భూముల రికార్డులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో భూముల అసలు హక్కులు, హద్దులపై స్పష్టత తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ 1954 నాటి పహాణీ, పైసల్ పట్టీ రికార్డులను పరిశీలించాలని, డాక్యుమెంట్ నంబర్ 585/1973ను నిర్ధారించడంతో పాటు దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సునీత రెడ్డిని ఆదేశించారు. అలాగే సర్వేయర్ పాండురంగారెడ్డితో సమగ్ర విచారణ జరిపించి, గ్రామకంఠం భూముల హద్దులను తక్షణమే నిర్ధారించాలని సూచించారు.

రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందంటూ గ్రామస్థుల ఆరోపణలు

ఈ భూముల వ్యవహారంలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందంటూ గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2021లో రూపొందించిన డాక్యుమెంట్లను గ్రామకంఠం భూముల ఆక్రమణదారుడు తాడూరి జనార్దన్ రెడ్డి, అప్పటి కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, గ్రామానికి చెందిన కారోబార్పై ఒత్తిడి తెచ్చి 1991లోనే తయారైనట్లుగా చూపించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? రికార్డుల్లో అక్రమాలు జరిగాయా? అన్నది అధికారుల సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చేపట్టనున్న విచారణలో వెలుగుచూసే వాస్తవాలపై గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదులకంటి నరేష్ గౌడ్, సీఐ మద్ది మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు పోకల్కార్ నిఖిల్, టేకుమట్ల ప్రసాద్, తుంకోజు సాయి, డీఎస్పీ నాయకులు రవీందర్ తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 1,081