నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి: ఏబీవీపీ డిమాండ్
నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేసిన ఏబీవీపీ నాయకులు
విజేత,మహేశ్వరం : గిరిజన బిడ్డ శిరీషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వనవాసి కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ, గిరిజన యువతి శిరీషపై జరిగిన అత్యంత దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకొని త్వరితగతిన శిక్ష అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.“గిరిజన బిడ్డలు ఈ సమాజంలో భద్రంగా తిరగకూడదా? గిరిజనులు బాగుపడకూడదా?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజనులపై జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు.ఈ ఘటనలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నగర్ కార్యదర్శి ప్రణీత్, సయీద్, అభిలాష్, రోహిత్, సాయి కార్తీక్, చింటూ, శృతి తదితరులు పాల్గొన్నారు.
*ఏబీవీపీ డిమాండ్లు:*
- శిరీష హత్య కేసులో నిందితుడిపై అత్యంత కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి.
- గిరిజన మహిళలు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.