Logo
Date of Publish : 15 November 2026, 5:14 pm
Editor : B. Anil Kumar

గిరిజనులలో చైతన్యం రగిలించినఅగ్నికణం “బిర్సా ముండా”

- బిజెపి జిల్లాఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో బిర్సాముండా. జయంతి వేడుకలు

జగ్ననాథపూర్ లో జన జాతీయ గౌరవ దివస్.

విజేత,రాయికల్: బ్రిటిష్ పరిపాలన కాలంలో గిరిజన హక్కులకై పోరాడి అతిపిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని బిజెపిజగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామంలో బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలకు ముఖ్య అతిథిగాహాజరైన బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ ఒక గిరిజన నిరుపేద కుటుంబంలో 15 నవంబర్ 1975లో జన్మించిన బిర్సా ముండా తన చిన్నతనంలో గొర్రెలు కాసేవాడని తర్వాత ఒక మిషనరీ స్కూల్లో చదువుతున్న ఆ రోజుల్లోనే బ్రిటిష్ పాలనలోని జమీందారు వ్యవస్థ, వెట్టిచాకిరి నచ్చక బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గిరిజన భూములు లాక్కున్న జమీందారు వ్యవస్థపై పోరాటం మొదలుపెట్టి 'గిరిజన గూడెం లలో విప్లవాన్ని రగిలించిన అగ్నికణం బిర్సాముండా' అని కొనియాడారు.బిర్సా ముండా తన 24వ ఏట మహా విప్లవానికి నాయకత్వం వహించి అటవీభూములపై గిరిజనులకే హక్కులు అంటూ పోరాడి గిరిజన పాలిట దేవుడు అయ్యారని అన్నారు. తన 24 ఏళ్ల వయసులో గిరిజన జాతికి తండ్రిగా భావించి బిర్సాముండాను భగవాన్ అని పిలుచుకోబడిన త్యాగమూర్తి అని అన్నారు. గిరిజన హక్కులకై చేస్తున్న పోరాటం బ్రిటిష్ పాలకులకు కంటినిండా నిద్ర లేకుండా చేసినందుకు బ్రిటిష్ వారు బిర్సాముండాను అరెస్టు చేసి రాంచి జైల్లో బంధించి విషం ఇచ్చి చంపి చివరకు అనుమానాస్పద మృతిగా సృష్టించి, కలరా వ్యాధి సోకడం వల్ల మరణించారని చిత్రీకరించారని అన్నారు.బిర్సా ముండా ఆశయాలను స్పూర్తిగా తీసుకొనిమన భారతప్రధాని నరేంద్రమోడీ భారతదేశంలోని 19,500 గ్రామాలకు కనీస సౌకర్యాలు తాగునీరు, రోడ్లు, విద్యుత్తు మౌలికవసతులు కల్పించి గిరిజనుల పాలిట దేవుడు అయ్యారని అన్నారు. సాంకేతికశాస్త్ర పరిజ్ఞానం ఎరుగని తండాలకు సైతం నరేంద్ర మోడీ నాయకత్వంలో సెల్ ఫోన్, ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి శాస్త్రసాంకేతికపరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ఆదివాసి గిరిజన తండాలను భాగస్వాములను చేస్తున్నారంటే దానికి స్ఫూర్తి బిర్సాముండా అని కొనియాడారు.రాజ్యాంగ ఫలాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి అందినప్పుడే అంత్యోదయ లక్ష్యం నెరవేరుతుందని అందుకే అస్సాంలోని తేయాకు తోటల్లో కూలిపని చేసుకునే కుటుంబంలోనుంచి ద్రౌపది ముర్మును భారతదేశ రాష్ట్రపతిని చేసి ఆదివాసీలకు అరుదైన గౌరవం నరేంద్రమోదీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బాణావత్ తిరుపతి నాయక్ , ఓబీసీ మోర్చారాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చనారాయణ,జిల్లా కార్యదర్శిలు ఏనుగుముత్యం రెడ్డి, పాతరమేష్ ,ఓబీసీ జిల్లా మోర్చాఅధ్యక్షుడు వేణు, ఎస్సీ జిల్లామోర్చాఅధ్యక్షుడు అశోక్ రాయికల్ మండల అధ్యక్షుడు ఆకుల మహేష్, రాయికల్ పట్టణ అధ్యక్షుడు కుర్మా మల్లారెడ్డి మండల& పట్టణ ప్రధాన కార్యదర్శిలు వట్టిమల్ల శ్రీనివాస్,కునారపు భూమేష్ ,ఎస్టిమోర్చా నాయకులు రాజేందర్ నాయక్, గంగాధర్ నాయక్,గణేష్ గొండ్, సచిన్ పటేల,సుమన్ నాయక్, నర్సయ్య,నందునాయక్, రాజేందర్ నాయక్ ,గిరిజ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 2,735