Logo
Date of Publish : 17 September 2026, 6:27 pm
Editor : B. Anil Kumar

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలి 

కృష్ణా నది నిమజ్జన ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

విజేత,కృష్ణ : గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.కృష్ణ మండల పరిధిలోని కృష్ణా నది వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్ పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నది వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. నిమజ్జన ప్రదేశంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేసి, నిరంతరం ప్రజలకు భద్రతా సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కృష్ణా నది వద్ద నీటి ప్రవాహం, లోతు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రికల్ శాఖ అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.గణేష్ విగ్రహాలు నిమజ్జన ప్రదేశానికి చేరుకునే సమయంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భారీ విగ్రహాలు పెద్ద సంఖ్యలో కృష్ణా నది వరకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా మార్గాల్లో క్షేత్రస్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.“ఒక నిండు ప్రాణం ఎంతో విలువైనది. నిమజ్జనం సందర్భంగా చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి అపశృతి జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని ఎస్పీ సూచించారు.గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు కూడా పోలీసు అధికారులు సూచించే భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నది లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు.నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రిసోర్స్‌లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద గణేష్ విగ్రహాలు కృష్ణా నది వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున, నిమజ్జన మార్గాలు, నది పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు.గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, భక్తి భావంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సురక్షితంగా పూర్తయ్యేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లు మహేష్ నల్లపు లింగయ్య, సీఐ రామ్ లాల్ ఆర్ఐ విజయ్ భాస్కర్, ఎస్ఐ లు ఎస్ ఏం నవీద్, భాగ్యలక్ష్మి రెడ్డి, లోకల్ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )