Logo
Date of Publish : 09 October 2026, 7:59 pm
Editor : B. Anil Kumar

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

విజేత,రాయికల్‌: కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ముందస్తు దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆరు అడుగుల బతుకమ్మను అందంగా పేర్చారు. విద్యార్థులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి పాఠశాలకు తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలు, ఆటలు, దాండియా నృత్యాలు, కోలాటాలతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )