విజేత,వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వేములవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా బ్యాడ్జ్‌ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
స్టూడెంట్ కౌన్సిల్ లీడర్స్, 1-2-3 ర్యాంకర్లు, సబ్జెక్ట్ టాపర్స్, స్టార్ రైటర్స్, స్టార్ రీడర్స్, స్పీకింగ్ స్క్వాడ్ తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక బ్యాడ్జ్‌లను అందజేసి అభినందించారు.పాఠశాల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకట కృష్ణ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కృషిని అభినందించారు. ప్రిన్సిపాల్ వెంకటేష్ ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ, విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.
