Logo
Date of Publish : 22 June 2026, 6:28 pm
Editor : B. Anil Kumar

కుడి చెరువు మత్తడి వద్ద అగ్ని ప్రమాదం

కుడి చెరువు మత్తడి వద్ద అగ్ని ప్రమాదం

– హుటాహుటిన చేరుకున్న చైర్‌పర్సన్ సరిత ఫైర్ సిబ్బందితో మంటలు అదుపు 

– ప్రాణ,ఆస్తి నష్టం తప్పించిన సిబ్బందికి కృతజ్ఞతలు

విజేత,చొప్పదండి: చొప్పదండి పట్టణ కేంద్రంలోని కుడి చెరువు మత్తడి ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లురి సరిత శ్రీనివాస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.వెంటనే ఫైర్ ఇంజన్ సర్వీస్‌కు సమాచారం అందించగా, సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి పెద్ద ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక శాఖ సిబ్బందికి, సహకరించిన స్థానిక ప్రజలకు చైర్‌పర్సన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పెరమాండ్ల మానస గంగయ్య గౌడ్,స్థానిక యువత పాల్గొన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చైర్‌పర్సన్ సూచించారు


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )