Logo
Date of Publish : 13 October 2026, 11:32 am
Editor : B. Anil Kumar

కిస్మత్‌పూర్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి

బీజేపీ నాయకుడు నీరుడు పవన్ సాయి రాజేంద్రనగర్ ఏసీపీకి వినతిపత్రం అందజేత

ప్రాణాలను బలిగొంటున్న అతివేగానికి కళ్లెం వేయాలని డిమాండ్

విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కిస్మత్‌పూర్ డివిజన్-122 పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు స్థానిక ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రధాన రహదారులపై వాహనాలు పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తుండటంతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా బీజేపీ డివిజన్ నాయకుడు నీరుడు పవన్ సాయి చొరవ తీసుకున్నారు.సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఆయన స్వయంగా రాజేంద్రనగర్ పోలీస్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రమాదాలు నివారించడానికి డివిజన్‌లోని అత్యంత రద్దీగా ఉండే కీలక ప్రాంతాల్లో తక్షణమే స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్/స్లో మూవింగ్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

*ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారులు ఇవే*:

1, *కిస్మత్‌పూర్ నుండి రాక్ చర్చ్ వరకు ఉన్న రహదారి*

2, *దర్గా / ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుండి కాళీ మందిర్ వరకు ఉన్న రహదారి*

3, *కిస్మత్‌పూర్ బ్రిడ్జి నుండి కిస్మత్‌పూర్ వివేకానంద విగ్రహం వరకు ఉన్న రహదారి

4.అవసరమైన ఇతర రద్దీ ప్రాంతాల్లో స్లో మూవింగ్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు

ఈ మార్గాల గుండా ప్రతిరోజూ వేలాది మంది పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాలలు-కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రయాణిస్తుంటారని, అతివేగంతో దూసుకొచ్చే వాహనాల వల్ల వీరంతా నిత్యం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోందని పవన్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకొని, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను అధికారులు స్వయంగా పరిశీలించాలని ఆయన కోరారు. నిబంధనల ప్రకారం వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా సంబంధిత ట్రాఫిక్ మరియు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, సంబంధిత అధికారులు ఈ విజ్ఞప్తిని అత్యవసరంగా పరిగణించి వెంటనే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని పవన్ సాయి డిమాండ్ చేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )