Logo
Date of Publish : 02 September 2026, 1:31 pm
Editor : B. Anil Kumar

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ నిరసన

విజేత,చేవెళ్ల: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్లలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దళ్ల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌. ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )