ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి
ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు
విజేత,వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంతో పాటు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కరెంటు కంటిరెప్ప పాటున పోయే పరిస్థితి లేదని జిల్లా వాసులు అంటున్నారు. సాయంత్రం, రాత్రి సమయంలో కరెంట్ పోవడం వల్ల వ్యవసాయ దారులతో పాటు, ప్రజలు ఈగలు దోమలతో నాన అవస్థలు పడే పరిస్థితి దాపురించిందని అంటున్నారు. వర్షాకాలంలో కరెంటు పోవడం వల్ల ప్రజలు నాన అవస్థలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని కరెంట్ పోకుండా చూడాలని వికారాబాద్ జిల్లా ప్రజలు కోరుచున్నారు.