Logo
Date of Publish : 30 September 2026, 12:44 pm
Editor : B. Anil Kumar

కల్కి భగవాన్ ఇక లేరు

'ఏకం’ ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకుడు

మానవతా విలువలు, సేవాభావంపై భక్తులకు మార్గదర్శనం విషాదంలో భక్తులు..

విజేత,కామారెడ్డి జిల్లా ప్రతినిధి: కల్కి భగవాన్ ప్రసిద్ధి చెందిన విజయకుమార్ నాయుడు (77) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్ర తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆధ్యాత్మిక గురువు ప్రసిద్ధి చెందిన ఆయన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం కేంద్రంగా 'ఏకం' సంస్థను స్థాపించి, ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవాభావంపై భక్తులకు మార్గదర్శనం చేశారు. ఆయన మృతి వార్తతో భక్తులు, శిష్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భక్తుల దర్శనార్థం ఆయన భౌతిక దేహాన్ని ఏకం క్షేత్రంలో ఏర్పాటుకు సన్న హాలు చేస్తున్నారు.1949లో తమిళనాడులో జన్మించిన విజయకుమార్ చెన్నెలో చదువుకున్నారు. కొంతకాలం ఎన్ఐసీలో క్లర్క్ గా పని చేశారు. 1977 జూన్ 9న పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆధ్యాత్మిక, ప్రత్యామ్నాయ విద్యవైపు అడుగులు వేశారు. 1980వ దశకం మధ్యలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపేట సమీపంలో జీవాశ్రమం పేరుతో రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించారు. విద్యార్థుల వికాసం, ఆత్మ పరిశీలనపై దృష్టిపెట్టే విధంగా ఈ సంస్థను తీర్చిదిద్దారు. అనంతరం ఈ ప్రాజెక్టు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేంద్రంగా ‘సత్యలోకం'గా పేరు మార్చారు. 1990వ దశకం చివర్లో విజయకుమార్ తనను కల్కి అవతారంగా భావించే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన భార్య పద్మావతి అమ్మ భగవాన్ పేరుతో అనుచరులకు పరిచయమయ్యారు. ఈ ఆధ్యాత్మిక ఉద్యమం ఆ తరువాత ‘వన్నెస్' పేరుతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ధ్యానం, ఆత్మ పరిశీలన, అంతర్గత మార్పు, మానసిక ప్రశాంతత వంటి అంశాలకుదేశ, విదేశాల నుంచి అనేకమంది ఈ కేంద్రానికి వచ్చేవారు. కాలక్రమంలో కల్కి భగవాన్కు భారీగా అభిమానులు, అనుచరులు ఏర్పడ్డారు. సంస్థ ఎదుగుదలతో పాటూ వివాదాలూ మొదలయ్యాయి. భూముల కొనుగోలు, విరాళాలు, ఆర్థిక లావాదేవీలపై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. 2017లో వన్నెస్ సంస్థతో పాటు వ్యాపార కార్యకలాపాల బాధ్యతలను తన కుమారుడు ఎన్కవీ కృష్ణ, కోడలు ప్రీతా కృష్ణకు అప్పగించారు. అనంతరం సంస్థ పేరును 'ఏకం'గా మార్చారు. కాలక్రమంలో వన్నెస్ ఉద్యమం అనేక పేర్లతో కొనసాగింది. వాటిలో ఫౌండేషన్ ఫర్ వరల్ట్ అవేకెనింగ్, గోల్డెన్ ఏజ్ ఫౌండేషన్, భగవద్ ధర్మ, కల్కి ధర్మ, వన్నెస్ యానివర్శిటీ, వన్నెస్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవల్పమెంట్, ఇంధన రంగం, మీడియా, క్రీడలు తదితర రంగాల్లో భగవాన్ పెట్టుబడులు పెట్టారు. ఏకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )