Logo
Date of Publish : 04 August 2026, 6:42 pm
Editor : B. Anil Kumar

ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ.

విజేత,తరిగొప్పుల : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తరిగొప్పుల మండల విద్యాశాఖాధికారిణి శ్రీమతి నెల్లుట్ల జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మరియు ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 29వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. 10వ తరగతి ప్రవేశాలకు 14 సంవత్సరాలు పూర్తైన వారు, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు మరియు ఇతర అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తుల వివరాలు, అర్హతలు, ఇతర సమాచారానికి క్రింది సంప్రదింపు కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్
బాలికల పాఠశాలలో సంప్రదించవలసిందిగా ఆమె తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )