Logo
Date of Publish : 21 June 2026, 10:33 am
Editor : B. Anil Kumar

ఎస్.రాయవరంలో అనధికార బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు

ఎస్.రాయవరంలో అనధికార బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు

తిమ్మాపురంనకు చెందిన వ్యక్తి అరెస్ట్

7 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం

విజేత,ఎస్.రాయవరం, నక్కపల్లి : పాయకరావుపేట ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో అనధికార మద్యం బెల్ట్ షాపులపై స్థానిక ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.స్థానిక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల కొన్ని గ్రామాలలో అనధికార మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు స్థానిక ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి అనధికార బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడులలో మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆ సమయానికి అతని వద్ద ఉన్న 7 అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న నేరంపై ఎస్. రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపై ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసు తెలిపారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కే.మురళీమోహన రావు కానిస్టేబుల్ లు డి.నాగ శంకర్రావు, ఆర్.జగన్నాద్ సహా సిబ్బంది పాల్గొనట్లు తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )