Logo
Date of Publish : 01 September 2026, 3:45 pm
Editor : B. Anil Kumar

ఎక్సలెంట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోండి 

మండల విద్యాధికారి కార్యాలయ సిబ్బందిని బదిలీ చేయండి

భక్తు విజయ్ కుమార్

విజేత,చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన చైల్డ్ ఇన్ఫో యు డి ఐ ఎస్ ఇ లో భక్తు అద్వితశ్రీ 2023 నుండి 2026 వరకు 1, 2, 3 తరగతులు ఎక్సలెంట్ స్కూల్లో చదివిన ఆన్లైన్ చేయలేదని, మేము ఫీజులు కట్టి ఎంతో నమ్మకంతో చదివిస్తే కనీసం యు డి ఐ ఎస్ ఇ లో ఆన్లైన్ చేయలేదని, ఆన్లైన్ చేయడంలో కంప్యూటర్ ఆపరేటర్ నిర్లక్ష్యమా, యాజమాన్యం నిర్లక్ష్యమా బాధ్యత లేకుండా వ్యవహరించారని,తక్షణమే ఎక్సలెంట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భక్తు విజయ్ కుమార్ మండల విద్యాధికారికి మంగళవారం ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఫిర్యాదులో ఎక్సలెంట్ పాఠశాలలో పి పి టి టి సి,డి ఈ డి, బీఈడీ లు ఉన్నారా అని కనీసం పరిశీలించని,పర్యవేక్షించని మండల విద్యాధికారి కార్యాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పిల్లల తల్లిదండ్రుల ఫీజులు కట్టి పాఠశాలకు పంపిస్తే,పిల్లల పేర్లు ఆన్లైన్ చేయకపోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని,తక్షణమే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ కోరారు.లేనిపక్షంలో సమస్యను లిఖితపూర్వకంగా జిల్లా విద్యాధికారికి,జిల్లా కలెక్టర్ కు సృష్టికి తీసుకువెళ్తూ ఫిర్యాదు చేస్తామని విజయ్ కుమార్ తెలిపారు.మా కుమారుని ది యు డి ఐ ఎస్ ఇ చేయకపోవడం వల్ల సిరిసిల్ల జిల్లా కార్యాలయం కు వెళ్లి తల్లిదండ్రులమైన మేమే ఆన్లైన్ చేసుకున్నామన్నారు. విషయంపై మండల విద్యాధికారి కార్యాలయంలో సిబ్బందికి ఫోన్ చేస్తే తల్లిదండ్రులమైన మమ్ములను బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి బదిలీలు లేక ఇక్కడే కొనసాగుతున్న సిబ్బందిని బదిలీ చేయాలని విజయ్ కుమార్ కోరారు.ఆ పాఠశాలలో చదివే తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు వెళ్లి వారి పిల్లల డేటా యు డి ఐ ఎస్ ఇ ఉందో లేదో, పాఠశాల సిబ్బంది క్వాలిఫై టీచర్స్ ఉన్నారో లేదో తెలుసుకోవాలని కోరారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )