వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
పరీక్షలతో దాగి ఉన్న గుండె సమస్యలు వెలుగులోకి : రోగుల హర్షం
విజేత,గజ్వేల్ : వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రజల సౌకర్యార్థం సేవా భావంతో నెలకొల్పిన 1250 పడకల ఆర్.వి.ఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ లో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుండె సంబంధిత రోగులకు ఈసీజీ, 2డి -ఎకో, కొవ్వు పరీక్ష (లిపిడ్ ప్రొఫైల్), ఆర్.బి.ఎస్ షుగర్ పరీక్షలను ఉచితంగా చేసి, కొంతమందికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.ఈ క్యాంపు వల్ల తమలో దాగి ఉన్న గుండె సమస్యలు బయటపడ్డాయని రోగులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ భాను కిరణ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్.వి.ఎం సీఈఓ దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.