Logo
Date of Publish : 01 September 2026, 2:36 pm
Editor : B. Anil Kumar

ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ కు దీటుగా ఐడీ కార్డులు

300 మంది విద్యార్థులకు రూ.20 వేలు సొంత నిధులతో అందజేసిన మాజీ మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేష్

విజేత,చొప్పదండి : చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మోడల్ స్కూల్ లో సుమారు 300 మంది విద్యార్థినీ విద్యార్థులకు చొప్పదండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ సుమారు రూ. 20 వేలు తన సొంత ఖర్చుతో విద్యార్థులకు ఐడీ కార్డులను తయారు చేయించి పంపిణీ చేశారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే ఐడీ కార్డులు ఉండాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే విద్యను ఏకాగ్రతతో అర్థం చేసుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించి చదువు చెప్పిన గురువులకు,కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావణ్య,అధ్యాపక బృందం,చింటూ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )