విజేత,రాయికల్: ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న అమృత్ 2.0 అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, చిల్డ్రన్స్ పార్కును సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. పార్కు అభివృద్ధి పనులు నిర్దేశిత వేగంతో కొనసాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పనులు ఆలస్యం చేసిన సంబంధిత కాంట్రాక్టర్‌కు వెంటనే నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం రాయికల్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పట్టణంలో కొనసాగుతున్న ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ శ రవీందర్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
