Logo
Date of Publish : 02 September 2026, 4:24 pm
Editor : B. Anil Kumar

అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడ్డ బుల్డోజర్లు నర్సింగి సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ వర్గాల సంచలన చర్యలు

విజేత,రాజేంద్రనగర్ : అనుమతులు లేవు.. నిబంధనలకు అస్సలే తావు లేదు.. 'మేము కట్టేస్తాం.. ఎవరు ఆపుతారో చూద్దాం' అనే ధోరణితో రెచ్చిపోతున్న అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్ల సవ్వడి వణుకు పుట్టించింది! నర్సింగి సర్కిల్-45 పరిధిలో నిబంధనలు త్రోసిరాజని వెలసిన అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కఠిన సమర శంఖారావం పూరించారు.పుప్పాలగూడలోని నేమలినగర్ ప్రాంతంలో రాత్రికి రాత్రే గాల్లోకి లేచిన 4 అక్రమ భవనాలను, అలాగే నేకనంపూర్ ఆల్కపూర్ కాలనీలో దర్జాగా నిర్మించిన 1 అక్రమ నిర్మానాన్ని అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన అధికారులు, సదరు భవనాలను పునాదులతో సహా కూల్చివేసి అక్రమార్కులకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు.*అక్రమ నిర్మాణదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు*చట్టాన్ని అతిక్రమించి, అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులోనూ ఇదే తరహా సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయని టౌన్ ప్లానింగ్ అధికారులు ఘాటుగా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బుల్డోజర్లు సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. అనుమతులు లేని కట్టడాలు కొనుగోలు చేసి ప్రజలు తమ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )