విజేత, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల పరిధిలోని చిత్రియాల గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ అంకాలమ్మ జాతర మహోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ మరియు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ మరియు కేతావత్ భీల్యా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.అలాగే వానలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి రైతన్నల ఇళ్లలో ఆనందం నిండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చాట్ల చిరంజీవి, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య యాదవ్, మోహన్ కృష్ణ, శంకర్ నాయక్, హరి నాయక్, రమేష్ నాయక్, రాములు యాదవ్, వాజిద్ పాషా, చాట్ల ప్రశాంత్, జైపాల్ నాయక్, చిత్రియాల అంజి, నిరంజన్ నాయక్, తెర్ల గోవర్ధన్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.