Logo
Date of Publish : 30 July 2026, 7:38 am
Editor : B. Anil Kumar

శివరాంపల్లి బోనాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలినేతాజీ యువజన సంఘం

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు కళాకారుల ప్రోత్సాహం కోసం వినతిపత్రం సమర్పణ

విజేత,రాజేంద్రనగర్ : శివరాంపల్లి గ్రామంలో ఆగస్టు 9, 10 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని, స్థానిక సంస్కృతి-సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద కళాకారులను, డప్పు కళాకారులను ప్రభుత్వం తరఫున ప్రోత్సహించాలని నేతాజీ యువజన సంఘం కోరారు.ఈ సందర్భంగా రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్,నేతాజీ యువజన సంఘం ప్రతినిధులు ప్రత్యేక వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ దేవతల పండుగలో స్థానిక కళాకారుల పాత్ర అత్యంత కీలకమని, వారికి తగిన ప్రాధాన్యతతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని ఎమ్మెల్యేను కోరారు.లేఖను స్వీకరించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ, బోనాల పండుగను దిగ్విజయం చేయడానికి మరియు కళాకారులకు తగిన గుర్తింపు లభించేలా చూసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారుల సంక్షేమం మరియు గ్రామీణ సంస్కృతి పరిరక్షణకు ఎమ్మెల్యే చూపిన ఆదరణకు, స్పందనకు నేతాజీ యువజన సంఘం తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బోనాల పండుగను శివరాంపల్లిలో వైభవంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని నేతాజీ యువజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )