Logo
Date of Publish : 20 June 2026, 10:07 am
Editor : B. Anil Kumar

శివరాంపల్లి ‘క్లైర్రా మార్ట్’లో వినియోగదారుడికి చేదు అనుభవం

*శివరాంపల్లి 'క్లైర్రా మార్ట్'లో వినియోగదారుడికి చేదు అనుభవం*

*నాణ్యత లేదని బియ్యం సంచులు వెనక్కి ఇస్తే నిరాకరణ సిబ్బంది దురుసు ప్రవర్తన*

విజేత రాజేంద్రనగర్ : శివరాంపల్లి లో స్థానికంగా ఉన్న క్లైర్రా మార్ట్ కిరాణా దుకాణంలో ఓ వినియోగదారుడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. నాణ్యత లేదని కొనుగోలు చేసిన బియ్యం సంచులను తిరిగి ఇవ్వడానికి వెళ్తే సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు బెదిరింపులకు దిగారని బాధితుడు వాపోతున్నాడు.

*అసలేం జరిగింది?*

బాధితుడి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, శివరాంపల్లిలోని క్లైర్రా మార్ట్‌లో 2 సంచుల శివమ్ బియ్యం, 3 సంచుల SS బియ్యం కొనుగోలు చేశాడు. కొనుగోలు సమయంలో బియ్యం నాణ్యత బాగోలేకపోతే బిల్లు చూపించి తిరిగి ఇవ్వవచ్చని సిబ్బంది హామీ ఇచ్చారు యజమాని.అయితే ఇంటికి వెళ్లి చూడగా బియ్యం నాణ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో 2 సంచులు తిరిగి ఇచ్చేందుకు మార్ట్‌కు వెళ్లాడు. కానీ అక్కడ సిబ్బంది సంచులు తీసుకోవడానికి, డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.

*"ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో"*

ఈ క్రమంలో సిబ్బంది సభ్యుడు హనీజ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితుడు ఆరోపించాడు. "ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మేము తీసుకోము, డబ్బులు కూడా ఇవ్వము" అంటూ బెదిరింపులకు దిగాడని, బియ్యం సంచులను బయటకు విసిరివేశాడని తెలిపాడు.

*వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు*

హామీ ఇచ్చి మాట తప్పడంతో పాటు దురుసుగా ప్రవర్తించడంపై బాధితుడు రాజశేఖర్ రెడ్డి మండిపడుతున్నాడు. ఈ వ్యవహారంపై లీగల్ నోటీసు పంపడంతో పాటు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. బిల్లు, బియ్యం సంచుల ఫోటోలు, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )