Logo
Date of Publish : 22 June 2026, 3:58 pm
Editor : B. Anil Kumar

మండలంలోని రైతు వేదికలలో విత్తన మేళా

మండలంలోని రైతు వేదికలలో విత్తన మేళా

- విత్తనాల ఎంపిక, పంటల సాగు సాంకేతికతపై రైతులకు అవగాహన

- మండల వ్యవసాయ అధికారి మనోహిత్ విక్రమ్ రావు

విజేత,తరిగొప్పుల / జనగామ: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుండి జూన్ 30వరకు తరిగొప్పుల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక మరియు అబ్దుల్‌నాగరం గ్రామ రైతు వేదికలలో విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మనోహిత్ విక్రమ్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విత్తన మేళాలో రైతులకు ధృవీకరించబడిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచబడతాయని వరి, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, కూర గాయల పంటలు, చిరుధాన్యాల విత్తనాలను రైతులు తమ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. అంతేకాక నానో యూరియా ప్లస్, నానో డిఏపీ వినియోగం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, పంటల వైవిధ్యీకరణ, నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల సాగు సాంకేతికతపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తరిగొప్పుల రైతు వేదిక లేదా అబ్దుల్‌నగరం రైతు వేదిక వద్ద నిర్వహించే విత్తన మేళాకు హాజరై నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రజలను కోరారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )