*మంచిరేవుల స్కూల్ వివాదం: నా కంప్లైంట్‌తోనే కూల్చివేతలు.. మాకేం సంబంధం*?
*బొర్రా జ్ఞానేశ్వర్ సంచలన వ్యాఖ్యలు.స్కూల్ యాజమాన్యంపై రివర్స్ ఎటాక్..
లీజుకు ఇస్తే మాకేంటి సంబంధం ముదిరాజ్ సంఘం చైర్మన్ ఫైర్
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ నార్సింగి సర్కిల్ పరిధిలోని మంచిరేవుల స్కూల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర సంచలనంగా మారుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ అండ్ లోకల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమపై వస్తున్న ఆరోపణలపై ముదిరాజ్ సంఘం రాష్ట్ర చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, స్కూల్ యాజమాన్యం తీరుపై నిప్పులు చెరిగారు. తమపై చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, స్క్రిప్ట్ రాసి మరీ బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
*కూల్చివేతలు నేనే చేయించా..ధీమాగా చెప్పిన జ్ఞానేశ్వర్*
ఈ వివాదంలో బొర్రా జ్ఞానేశ్వర్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. స్కూల్ అక్రమ కట్టడాలపై తానే స్వయంగా అధికారులకు ఫిర్యాదు చేశానని, నేను ఇచ్చిన కంప్లైంట్‌తోనే అధికారులు రంగంలోకి దిగి ఆ కూల్చివేతలు చేపట్టారు అని ఆయన స్పష్టం చేశారు. చట్టప్రకారమే చర్యలు జరుగుతుంటే,దాన్ని తమకు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు.సదరు స్కూల్‌కు మేము కేవలం స్థలాన్ని మాత్రమే లీజుకు ఇచ్చాం. అంతకుమించి ఆ స్కూల్ నిర్వహణతో కానీ, అక్కడ జరిగే వ్యవహారాలతో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. స్కూళ్లకు ప్రభుత్వ అనుమతులు ఇచ్చే అధికారం మాకు ఎక్కడిది? మేము కేవలం లీజుదారులుగా మాత్రమే ఉన్నాం.
*బొర్రా జ్ఞానేశ్వర్ నా కుమారుడిని ఇబ్బంది పెడుతున్నారు ఆధారాలు చూపండి*
ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై బురదజల్లడం ఎంతవరకు సమంజసమని జ్ఞానేశ్వర్ నిలదీశారు. స్కూల్ యాజమాన్యం కావాలనే కుట్రపూరితంగా తన కుమారుడిని మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని, నిజానిజాలు త్వరలోనే తేలుతాయని హెచ్చరించారు.
