Logo
Date of Publish : 29 June 2026, 8:47 am
Editor : B. Anil Kumar

పోలియో చుక్కలతో… చిన్నారుల జీవితాల్లో వెలుగు… తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి

విజేత, తాండూరు: జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ… సమాజాన్ని పోలియో రహితంగా మార్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని అన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదనే లక్ష్యంతో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు శ్రమిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తు తరాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, వైద్య అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు తల్లులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )