Logo
Date of Publish : 06 August 2026, 11:49 am
Editor : B. Anil Kumar

తల్లిపాల ప్రాధాన్యంపై అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

విజేత,రాయికల్ : ప్రపంచతల్లిపాలవారోత్సవాల సందర్భంగా రాయికల్ మండలంలోని కొత్తపేట, ధర్మాజీపేట గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.కొత్తపేట గ్రామంలో గ్రామసభ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మీనుగు రాజగంగు అంజయ్య మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమని అన్నారు. ముర్రుపాల ప్రాముఖ్యత, గర్భిణీలు, బాలింతలు పాటించాల్సిన పరిశుభ్రత, తీసుకోవాల్సిన పౌష్టికాహారం, చేయాల్సిన వ్యాయామాలపై అవగాహన కల్పించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం గురించి వివరించారు.అదేవిధంగా ధర్మాజీపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తల్లిపాల ప్రాధాన్యంపై బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు.ఈ కార్యక్రమాల్లో కొత్తపేట ఉపసర్పంచ్ తునికి రంజిత్, గ్రామ కార్యదర్శి రాజేష్, అంగన్వాడీ టీచర్లు అనురాధ, లలిత, ఆశా వర్కర్లు సత్యవతి, రజిత, వీవోలు, అలాగే ధర్మాజీపేట సర్పంచ్ వాకిటి గంగారెడ్డి, ఉపసర్పంచ్ గాయత్రి సంజీవ్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ రావు, అంగన్వాడీ టీచర్లు కాయితి ప్రమీల, మేకల అనురాధ, ఆశా వర్కర్ మేకల రమ, వీఓఏ లింగాల స్వాతి(శ్వేత) మేకలసరిత, గర్భిణీలు,బాలింతలు, చిన్నారులతల్లులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )