విజేత ,చిగురుమామిడి :చిగురుమామిడి మండల డిప్యూటీ తహసీల్దార్‌గా పి.కళావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా కళావతికి రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు చేరవేస్తానని తెలిపారు. భూ సమస్యలు,ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ జిపిఓ లు సిబ్బంది పాల్గొన్నారు.