విజేత,చిలకలూరిపేట : చిలకలూరిపేట పట్టణం నుంచి గణపవరం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా దారితప్పి వేగంగా దూసుకొచ్చిన గేదెలు క్షతగాత్రుడి వాహనాన్ని బలంగా ఢీకొన్నాయి. ఈ ఆకస్మిక ఘటనతో క్షతగాత్రుడు తీవ్రంగా గాయపడి కిందపడిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మానవత దృక్పధంతో స్పందించి, బాధితుడికి సహాయంగా నిలిచారు. తన కాన్వాయి లోనికి క్షతగాత్రుడిని ఎక్కించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, క్షతగాత్రుడికి మెరుగైన చికిత్స అందచేయాలనీ డాక్టర్ గారితో మాట్లాడిన ప్రత్తిపాటి...