Logo
Date of Publish : 16 November 2026, 12:26 pm
Editor : B. Anil Kumar

మాధవరం పరిధిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

సమస్యాత్మక గ్రామాల్లో కూంబింగ్ - అనుమానితుల ఇళ్లలో తనిఖీలు

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు పోలీసుల పటిష్ట చర్యలు

విజేత,మాధవరం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో, ఎమ్మిగనూరు డీఎస్పీ ఏ. శ్రీనివాసులు పర్యవేక్షణలో మాధవరం పరిధిలోని సౌలహళ్లి (చౌటుపల్లి), మాలపల్లి గ్రామాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.మంత్రాలయం సీఐ వి. గిరిబాబు, మాధవరం ఎస్ఐ విజయ్ కుమార్, మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున, సిబ్బంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు.మాలపల్లిలో ప్రజలతో సమావేశమై, సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గొడవలకు కారణమయ్యే వ్యక్తులపై ముందస్తు కేసులు నమోదు చేశారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమలులో ఉంటుందని, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తనిఖీల్లో పత్రాలు లేని 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 2,981