Logo
Date of Publish : 04 November 2026, 11:45 am
Editor : B. Anil Kumar

మంత్రాలయం టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోసిగి మురళి దొర

5,000 ఓట్లు సాధించిన కీలక నేతకు ఘన స్వాగతం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడమే లక్ష్యమని మురళి దొర వెల్లడి

విజేత ,మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 5,000 ఓట్లు సాధించిన కీలక నాయకుడు కోసిగి మురళి దొర తెలుగుదేశం పార్టీలో చేరారు.జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ సమక్షంలో, మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. మురళి దొరకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కోసిగి మురళి దొర మాట్లాడుతూ, టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం అవుతూ ముందుకు సాగుతోందని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలిపించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )

Total Views: 500