Logo
Date of Publish : 09 October 2026, 3:34 pm
Editor : B. Anil Kumar

పోస్టల్ శాఖ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

తాడేపల్లిగూడెం పోస్టల్ సూపర్డెంట్ ముత్యాల శ్రీనివాసరావు సూచన 

విజేత, నల్లజర్ల : ప్రతి విద్యార్థికి పాస్పోర్ట్ ఉండాలని పాస్పోర్ట్ బ్రహ్మ పదార్ధం కాదని పోస్టాఫీసు పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సులభంగా పాస్పోర్ట్ పొందవచ్చని ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని తాడేపల్లిగూడెం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ పోస్టల్ దినోత్సవం పురస్కరించుకొని ప్రకాశరావుపాలెం వైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో పోస్టల్ శాఖ శుక్రవారం పాస్పోర్ట్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల పైబడిన పోస్టాఫీసు ప్రస్ధానంలో టెక్నాలజీని అందిపుచ్చుకుని డిజిటల్ వైపు పయనిస్తూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నామని, పోస్టాఫీసు లేని ఊరు లేదని ఆయన గుర్తు చేశారు. సేవింగ్స్, డిపాజిట్లు, ఇన్సూరెన్స్, ఉత్తరాలు బట్వాడా, పార్శిల్, స్పీడ్ పోస్ట్, ఇండియా పోస్టు పేమెంట్స్, ఇంటర్నేషనల్ కొరియర్, ఆధార్, పాస్పోర్ట్ సేవలు ఇలా ఎన్నో అందిస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దేశంలోనే రెండో స్ధానంలో నెట్వర్క్ ఉన్న పోస్టల్ శాఖతో విదేశాంగ శాఖ టై అప్ అయ్యి పాస్పోర్ట్ సేవలు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. ఫ్రెండ్లీ నేఛర్ తో పనిచేస్తున్నామని తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్ధి డేటా ఖచ్చితంగా ఉంటే సాధారణ పాస్పోర్ట్ నెల రోజుల్లో, తత్కాల్ పాస్పోర్ట్ వారంలో పోస్టాఫీసు సేవా కేంద్రాలు ద్వారా పొందవచ్చని ఆయన వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.ఎస్.సాంబశివరావు మాట్లాడుతూ పాస్పోర్ట్ ఎంతో ప్రాముఖ్యత గలిగిందని, మల్టీ నేషనల్ కంపెనీల్లో పాస్పోర్ట్ కలిగిన విద్యార్ధులను మాత్రమే తీసుకుంటారని, ప్రతి ఇంజనీరింగ్ విద్యార్ధి పాస్పోర్ట్ కలిగి ఉండాలని, పాస్పోర్ట్ అవగాహన సదస్సు నిర్వహించిన పోస్టల్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కళాశాలలో ఆధార్ అప్డేట్ కేంప్ నిర్వహించాలని ఆయన పోస్టల్ శాఖను కోరారు. కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ టి.సుబ్రహమణ్యం, పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మండవల్లి గోపి, జి.లక్ష్మీనారాయణ, డి.రామకృష్ణ, కళాశాల హెచ్ఓడిలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )