Logo
Date of Publish : 01 September 2026, 1:12 pm
Editor : B. Anil Kumar

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండలనేని ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి భారీ స్పందన

200 పైచిలుకు యూనిట్ల సేకరణ

సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగుతున్న మెగా రక్తదానం వైద్య శిబిరం

విజేత,చిలకలూరిపేట: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేటలోని గ్రాండ్ వెంకటేశా హాలులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమానికి ప్రజలు, యువత నుంచి విశేష స్పందన లభించింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికే 200 మందికి పైగా రక్తదానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడానికి దాతలు ఇంకా భారీగా తరలివస్తుండటంతో శిబిరం వద్ద సందడి నెలకొంది. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజున ప్రాణదాతలుగా నిలవడం గర్వకారణమని పేర్కొంటూ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ రక్తదాన శిబిరం కొనసాగుతుంది.ఈ సందర్భంగా రక్తదాతలను మండలనేని చరణ్ తేజ ప్రత్యేకంగా అభినందించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )