Logo
Date of Publish : 18 July 2026, 9:35 pm
Editor : B. Anil Kumar

నేడు మంగవరంలో దివంగత కాపు నేత

వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ

కాపునాడు రాధా రంగ మిత్ర మండలి

పాయకరావుపేట నుంచి అరట్లకోట మీదుగా బారీ బైక్ ర్యాలీ

విజేత,పాయకరావుపేట,ప్రత్యేక ప్రతినిధి :మండలంలోని మంగవరంలో దివంగత కాపు నేత,స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు కాపునాడు,రాధా రంగ మిత్రమండలి తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్  హాజరు కానున్నట్లుతెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కాపునాడు రాధా రంగ మిత్రమండలి సభ్యులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమం పాయకరావుపేట పట్టణంలో గల గొర్రెల వీర్రాజు నగర్ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద నుండి అరట్లకోట మీదుగా మంగవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు.మంగవరం లో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనంతరం అక్కడకు విచ్చేసిన కాపునాడు రంగ రాధ మిత్రమండల సహా అతిథులందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు ఉన్నందున భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాపునాడు,రాధా రంగ మిత్రమండలి కోరింది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )