Logo
Date of Publish : 20 June 2026, 10:01 am
Editor : B. Anil Kumar

నియోజకవర్గంలో 20 వేల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా

  1. – పేట నియోజకవర్గంలో ఘనంగా ఎన్డీఏ ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవాలు
    – చినదొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా వరకు కూటమి నాయకులు,కార్యకర్తల బారీ ర్యాలీ
    – నియోజకవర్గంలో రూ.650 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు
    – ఎన్నికల వరకు పార్టీలు ఎన్నికల అనంతరం అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయం
    – విమర్శలకు ఎప్పుడూ వెరవను
    – ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించాలన్నా, తగ్గేదే లేదు
    – నా ధైర్యం,నా బలం నియోజకవర్గ వాసులు సహా రాష్ట్ర ప్రజలు,కూటమి నాయకత్వమే

– రాష్ట్ర హోం శాఖమంత్రి వంగలపూడి అనిత

విజేత,నక్కపల్లి :
నియోజకవర్గంలో 20 వేల ఉద్యోగాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టిడిపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని
నక్కపల్లి మండలంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద గల భారతి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆమె ఎన్డీఏ కూటమి శ్రేణులు, కార్యకర్తలు అభిమాన గణంతో కలసి చినదొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనితకు కూటమి పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.అనంతరం భారతి కన్వెన్షన్‌లో నిర్వహించిన విజయోత్సవ సభ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి,సంక్షేమ స్టాల్స్‌ను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ,గత రెండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.తాను 2013 వరకు ఒక సాధారణ ఉపాధ్యాయినిగా పనిచేశానని, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు . 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. 2019-24 మధ్య ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని తెలిపారు.2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 47 వేల మెజారిటీతో గెలిపించి మరో సారి అసెంబ్లీకి పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మంత్రి పదవి దక్కిందని అంటూ ఆమె ఎక్కడికి వెళ్లినా నియోజకవర్గ అభివృద్ధే తన ఆలోచన అని పునరుద్ఘాటించారు.గడచిన రెండేళ్లలో పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు రూ.650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పనులు చేపట్టామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇందులో భాగంగా పందూరు వంతెన పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని,త్వరలోనే వంతెనను ప్రారంభిస్తామని తెలిపారు. సోమిదేపల్లి గ్రామంలో రూ.9 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోందని,అణుకు గిరిజన గ్రామానికి రూ.3 కోట్లతో రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు.అడ్డరోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ యువతకు 20 వేల ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ చేసిన కృషిని కొనియాడుతూ, రైతుల త్యాగాలతోనే ఆ పరిశ్రమ సాధ్యమవుతుందని చెప్పారు. ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, సీఎస్‌ఆర్ నిధులతో ఉపమాక చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే
ఛేదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు ఉంటాయని,ఎన్నికల అనంతరం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. విమర్శలకు భయపడేది లేదని, ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని చెప్పారు. తన బలం,ధైర్యం పాయకరావుపేట నియోజకవర్గ వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు, కూటమి పార్టీల నాయకత్వమేన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ,గత ప్రభుత్వ పాలనలో ఉమ్మడి విశాఖ జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో కెల్లా అనకాపల్లి జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంమంత్రి అనిత ఎన్నో ప్రజా పోరాటాలు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ పాలనలో అనిత పోరాట పటిమను కొనియాడారు.ఆమె నాయకత్వంలో పాయకరావుపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు వ్యక్తం చేశారు.ఈ కార్కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్,జనసేన పార్టీ కార్యదర్శి బోడపాటి శివదత్,జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు,జిల్లా టిడిపి కార్యదర్శి లాలం కాసినాయుడు,మాజీ ఎంపీపీ సీనియర్ టిడిపి నాయకులు ఏజెర్ల వినోద్ రాజు,మండల టిడిపి అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు, సీనియర్ నాయకులు కూరందాసు నూకరాజు,నక్కపల్లి, వేంపాడు, పిఎసిఎస్ చైర్ పర్సన్ లు కొప్పిశెట్టి బుజ్జి,వెలగా శ్రీనివాసరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగా సుధాకర్ రావు,రాష్ట్ర కాపు డైరెక్టర్ పేదిరెడ్డి చిట్టిబాబు పాయకరావుపేట మండల టీడీపీ అధ్యక్షుల చించలపు పద్దు,పట్టణ శాఖ అధ్యక్షులు యాళ్ల వరాహలు బాబు, శ్రీరాంపురం పిఎసిఎస్ చైర్పర్సన్ చిక్కాల శ్రీను,రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరి,జనసేన పార్టీ నాయకులు, పంచాయతీ వార్డు మాజీ సభ్యురాలు సహా నారపు రెడ్డి పద్మ సహా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి కూటమి పార్టీల నాయకులు, ఎన్డీఏ కూటమి పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )