విజేత,అమలాపురం ప్రతినిధి : ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యచరణలో భాగంగా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ మామిడి కుదురు తహసిల్దార్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తున్న మామిడికుదురు మండల రెవెన్యూ సిబ్బంది, గురువారం మూడో రోజు కూడా నిరసన చేపట్టారు ఈకార్యక్రమంలో మామిడి కుదురు తహసిల్దార్. సి ఎస్ రాజు మాట్లాడుతూ పిఆర్సి ప్రకటించాలని పెండింగ్ లో ఉన్న డి ఏ లను చెల్లించాలని కోరారు, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా యధావిధిగా విధులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ కే శరణ్య. రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లా రెవెన్యూ అసోసియేషన్స్ ,ఎండి ఇబ్రహీం. వీఆర్వో లు అసోసియేషన్ అధ్యక్షుడు వర్ధినిడి శ్రీనివాస్ .విలేజ్ సర్వేయర్ల సంఘ అధ్యక్షు లు చాందిని . వీఆర్వోలు వీఆర్ఏలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.