Logo
Date of Publish : 01 September 2026, 2:11 pm
Editor : B. Anil Kumar

చిలకలూరిపేట ప్రజలు చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటారు : ప్రత్తిపాటి

• నిన్న రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.80లక్షలు, నేడు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన షేక్ హసీనా కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రికి నియోజకవర్గప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు : ప్రత్తిపాటి.

• షేక్ హాసీనా తల్లిదండ్రులు షేక్ రిహానా, మస్తాన్ లకు ప్రభుత్వ ఆర్థిక సాయం రూ.10 లక్షల చెక్కును అందచేసిన ప్రత్తిపాటి.

• తమ కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన హసీనా తల్లిదండ్రులు రిహానా, మస్తాన్.

• ఎమ్మెల్యే పుల్లారావు లేకుంటే మా కుటుంబం రోడ్డున పడేది : రిహానా (హసీనా తల్లి).

• ముఖ్యమంత్రి న్యాయం చేయకుంటే మా అక్క కుటుంబం నిలువునా సమాధి అయ్యేది : షేక్ రేష్మ (హసీనా పిన్ని).

• మైనారిటీ బిడ్డను బలితీసుకున్న దుర్మార్గుడిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి : అన్సర్ ఖాన్ (ముప్తీ -మతపెద్ద).

• ఎదిగిన బిడ్డను కోల్పోయిన మైనారిటీ కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీప్రభుత్వానికి మైనారిటీల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం : అన్సర్ ఖాన్.

విజేత,చిలకలూరిపేట : చిలకలూరిపేట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటారని, నిన్న రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాల్ని, నేడు ప్రేమోన్మాది చేతిలో హత్యగావింపబడిన షేక్ హసీనా కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప మానవతా మూర్తి చంద్రబాబు అని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.గతనెల 4న ప్రేమోన్మాది బాలసైదులు చేతిలో దారుణంగా హత్యగావింపబడిన షేక్ హాసీనా కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి మంగళవారం మృతురాలి తల్లిదండ్రులకు అందచేశారు. స్థానిక కూటమి నాయకులు, మైనారిటీ మతపెద్దలతో కలిసి 38వ వార్డులోని హసీనా ఇంటికి వెళ్లిన ప్రత్తిపాటి.. ఆమె తల్లిదండ్రులు షేక్ రిహానా, మస్తాన్ లను పరామర్శించి, రూ.10 లక్షల నగదు చెక్కుని వారికి అందచేశారు. అనంతరం ప్రత్తిపాటి, షేక్ రిహానా, మతపెద్ద (ముప్తీ) అన్సర్ ఖాన్ విలేకరులతో మాట్లాడారు.

హసీనా కుటుంబానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు : ప్రత్తిపాటి

ఆగస్ట్ 4న ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన మైనారిటీ యువతి షేక్ హసీనా కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకున్నామని, మృతురాలి తల్లిదండ్రులు, చెల్లెలికి భవిష్యత్ లోనూ అన్నివిధాలా అండగా ఉంటామని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అన్యాయం హసీనా కుటుంబానికి జరిగిందని ముఖ్యమంత్రికి తెలియచేసిన వెంటనే, ఆయన వెంటన స్పందించి పెద్ద మనసుతో సాయం చేద్దామని చెప్పారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వ నుంచి హసీనా కుటుంబానికి మంజూరైన రూ.10 లక్షల సాయాన్ని ఆమె తల్లిదండ్రులు రిహానా, మస్తాన్ లకు అందచేశామన్నారు.

నా బిడ్డను చంపిన దుర్మార్గుడికి ఎవరూ మద్ధతు ఇవ్వకూడదు : షేక్ రిహానా (హసీనా తల్లి)

నా బిడ్డను చంపిన దుర్మార్గుడికి మీడియా, సోషల్ మీడియా సహా ఎవరూ మద్ధతు ఇవ్వకూడదని హసీనా తల్లి షేక్ రిహానా విజ్ఞప్తి చేశారు. నేరస్తుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి, తమకు తగిన న్యాయం చేయాలన్నారు. చేతికంది వచ్చిన పెద్దబిడ్డను కోల్పోయిన మాకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అండగా నిలిచినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని రిహానా తెలియచేశారు. ఎమ్మెల్యే పుల్లారావు మాకు కొండంత అండగా నిలిచారని, చంద్రబాబు అందించిన ఆర్థిక సాయంతో చిన్నకూతుర్ని బాగా చదివించి, ప్రయోజకురాల్ని చేస్తానని రిహానా తెలిపారు.

ముఖ్యమంత్రి మా అక్క కుటుంబానికి న్యాయం చేయకుంటే.. అందరూ నిలువునా సమాధి అయ్యేవారు : షేక్ రేష్మ (హసీనా పిన్ని)

“ మాకు జరిగిన అన్యాయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్పందించారు. ఆనాడు మాతో మాట్లాడి దేవుడిలా మాకు అండగా నిలిచారు. ఒక దుర్మార్గుడి కారణంగా మా కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచింది, ఇంటింటికీ తెలుగుదేశం అంటూ.. మా ఇంటికి తెలుగుదేశం అండగా నిలిచింది. మాలాంటి పేద కుటుంబాలకు అండగా నిలిస్తే, కూటమి ప్రభుత్వాన్ని పేదలు ఎప్పటికీ విడిచిపెట్టరు. మా అమ్మాయిని చంపేసిన బాలసైదుల్ని ఎవరూ సమర్థించకూడదు. అతన్ని కఠినంగా శిక్షిస్తేనే ప్రభుత్వంపై మాలాంటి వారికి ఇంకా నమ్మకం పెరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు ఆర్థిక సాయం చేయకుంటే.. మా అక్క, ఆమె కుటుంబం మొత్తం ఇక్కడే నిలువునా సమాధి అయ్యేవారు.” అని హసీనా పిన్ని షేక్ రేష్మ గద్గద స్వరంతో చెప్పారు.

మైనారిటీ కుటుంబానికి న్యాయం చేసిన చంద్రబాబుకు, ప్రభుత్వానికి అల్లాహ్ ఆశీస్సులు ఉండాలి : అన్సర్ ఖాన్ : ముప్తీ (మతపెద్ద)

హసీనా కుటుంబాన్ని ఆదుకుంటామన్న వాగ్ధానాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి నిలబెట్టుకున్నారని, ఆయన ద్వారా మైనారిటీ కుటుంబానికి న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వానికి అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నామని ముప్తీ అన్సర్ ఖాన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మనసుతో మైనారిటీ కుటుంబానికి అండగా నిలిచారని, వారికి మైనారిటీల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. హసీనా మరణంతో మస్తాన్ కుటుంబం దిక్కులేనిది అయిందని, వారి బిడ్డకు జరిగిన అన్యాయం భవిష్యత్ లో మరెవరికీ జరగకుండా కూటమిప్రభుత్వం ఆడబిడ్డల రక్షణ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అన్సర్ ఖాన్ కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, జంగా వినాయకరావు, పిల్లి కోటేశ్వరరావు, ముస్లిం మత పెద్దలు, టీడీపీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )